అరవింద్ సావంత్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి
- కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్ కు అదనపు బాధ్యతలు
- రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన
- మహారాష్ట్రలో గంటకో మలుపు తిరుగుతోన్న రాజకీయ పరిణామాలు
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్ నిన్న మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాపై బీజేపీ మాట మార్చిందని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందువల్లే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు.