అయోధ్య తీర్పులో మీ జోక్యం ఏమిటి?.. మండిపడిన భారత్
- అయోధ్య మా అంతర్గత విషయం
- విద్వేషాలు సృష్టించడమే మీ పని
- పాక్ స్పందనను తీవ్రంగా ఖండిస్తున్నామన్న రవీశ్ కుమార్
అయోధ్య తీర్పుపై స్పందించిన పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ మాట్లాడుతూ.. ఈ తీర్పుతో భారత్‌లో ముస్లింలకు భద్రత లేదని మరోమారు రుజువైందన్నారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవ సమయంలోనే అయోధ్యపై తీర్పు వెల్లడించడం సరికాదని అన్నారు. ఈ తీర్పు తననెంతో విచారానికి గురిచేసిందని ఖురేషీ వ్యాఖ్యానించారు.