అయోధ్య తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం

  • అయోధ్య వివాదంపై సుప్రీం చారిత్రక తీర్పు
  • వివాదాస్పద భూమి హిందువులదేనని వెల్లడి
  • సుప్రీం తీర్పును అంగీకరిస్తున్నట్టు వక్ఫ్ బోర్డు ప్రకటన
అటు మతపరంగానూ, ఇటు రాజకీయంగానూ ఎన్నో ప్రకంపనలు సృష్టించిన అయోధ్య భూవివాదం సుప్రీం తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తీర్పు రాగానే సున్నీ వక్ఫ్ బోర్డు ఆచితూచి వ్యవహరించాలని భావించినా, కొన్నిగంటల్లోనే కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిస్థాయిలో సమీక్షించిన వక్ఫ్ బోర్డు, అయోధ్య వివాదంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయరాదని నిర్ణయించుకుంది. సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది.
Go Back to Shorts
Ayodhya
Supreme Court

More Telugu News