హెచ్ 1బీ దరఖాస్తుల తిరస్కరణలో భారత్ టెకీలవే అధికం!
- ట్రంప్ వీసాల నిబంధనలు కఠినతరం చేయడమే కారణం
- 2015- 2019 మధ్య 70 శాతం భారతీయుల దరఖాస్తులు తిరస్కరణ
- కాగ్నిజెంట్ కంపెనీకి చెందిన 60 శాతం దరఖాస్తులు తిరస్కరణ
ఈ కాలంలో 70 శాతం భారతీయుల దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయని పేర్కొంది. వీరిలో కొత్తగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారివి ఎక్కువగా ఉన్నాయని ఎన్‌ఎఫ్‌ఏపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండర్సన్ చెప్పారు. 2018లో భారత్‌కు చెందిన ఆరు సంస్థలలో 2,145 మందికి మాత్రమే హెచ్-1బీ వీసాలు రాగా, అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగుల కోసం ఏకంగా 2,399 హెచ్-1బీ వీసాలు వచ్చాయన్నారు.
టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కంపెనీకి చెందిన 60 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, తరువాతి స్థానంలో విప్రో, ఇన్ఫోసిస్ ఉన్నాయన్నారు. విదేశీ ఉద్యోగుల విషయంలో ఆపిల్, వాల్‌మార్ట్, కమ్మిన్స్ లాంటి కంపెనీల వీసాల మంజూరులో పెద్దగా మార్పులేదని ఎన్‌ఎఫ్‌పీఏ తెలిపింది.