మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్... మోదీ విమానానికి అనుమతి నిరాకరణ
- సౌదీ అరేబియా వెళ్లనున్న మోదీ
- పాక్ గగనతలం ఉపయోగించుకునేందుకు అభ్యర్థన
- భారత విజ్ఞప్తిని తిరస్కరించిన పాక్
గత నెలలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రయాణించే విమానానికి కూడా పాక్ ఇలాగే అనుమతించలేదు. కాగా, మోదీ విమానానికి అనుమతి నిరాకరణపై తమ వైఖరిని భారత హైకమిషనర్ కు తెలియజేస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని మోదీ ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.