Haryana: హర్యానా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టిక్ టాక్ తార

షార్ట్స్‌లో చూడండి
హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ అనేకమంది క్రీడాకారులకు, కళాకారులకు టికెట్లు ఇచ్చింది. వారిలో సోనాలీ ఫోగాట్ ఒకరు. సోనాలీ టిక్ టాక్ యాప్ లో తన వీడియోల ద్వారా కొద్దికాలంలోనే సెలబ్రిటీ హోదా అందుకుంది. అయితే ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సోనాలీకి పరాజయం ఎదురైంది. సోనాలీపై కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ బిష్ణోయ్ సుమారు 30,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఆదంపూర్ నియోజకవర్గం బిష్ణోయ్ కుటుంబానికి కంచుకోట వంటిది. అర్ధ శతాబ్ద కాలంగా అక్కడ బిష్ణోయ్ కుటుంబీకులదే పైచేయిగా కొనసాగుతోంది. ఎన్నికల ముందు హర్యానాలో బీజేపీదే హవా అని ప్రచారం జరిగింది. ఈ హవాలో తాను కూడా విజయం సాధిస్తానని సోనాలీ ఫోగాట్ భావించింది. కానీ ఆదంపూర్ ఓటర్లు మాత్రం బిష్ణోయ్ కుటుంబం వైపే నిలిచారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కులదీప్ బిష్ణోయ్ కి 64 వేల ఓట్లు రాగా, సోనాలీకి 34 వేల ఓట్లు పోలయ్యాయి.
Go Back to Shorts
Haryana
Sonali Phogat
BJP
Congress

More Telugu News