మమ్మల్ని అపారమైన అభిమానంతో దీవించారు: మహారాష్ట్ర, హర్యానా ప్రజలకు మోదీ కృతజ్ఞతలు
- మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- బీజేపీకి ఆధిక్యం
- ట్విట్టర్ లో మోదీ స్పందన
ఎన్నికల కోసం అహర్నిశలు శ్రమించిన బీజేపీ, శివసేనకు ప్రతి కార్యకర్తకు, యావత్ ఎన్డీయే కుటుంబానికి అభివందనం అంటూ పేర్కొన్నారు. హర్యానాలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ అభివృద్ధి అజెండాను వివరించిన బీజేపీ కార్యకర్తల కృషి శ్లాఘనీయం అని కొనియాడారు. కాగా, ఎన్నికల ఫలితాల్లో హర్యానాలో బీజేపీ మొత్తం 90 సీట్లకు గాను 40 సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను శివసేనతో కలసి 157 స్థానాల్లో నెగ్గి మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.