ఓట్లయితే వేయించుకున్నారు.. మరి మా ఇళ్లేవీ?: సిద్ధరామయ్య కారును కదలకుండా అడ్డుకున్న మహిళలు
- బాదామి ప్రాంతంలో పర్యటించిన సిద్ధరామయ్య
- ఆయన కారుకు అడ్డంపడి అడ్డుకున్న మహిళలు
- ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
వరదలు రావడంతో ఇప్పుడు ఇళ్లు లేక రోడ్డున పడ్డామని, తమకు దిక్కెవరని ప్రశ్నించారు. మీ ఓట్లు మీకొచ్చాయి కానీ తమకే ఇళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇప్పుడు ఇళ్లెవరు ఇస్తారని ప్రశ్నిస్తూ ఆయన కారును కదలకుండా అడ్డుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వారు నచ్చజెప్పి మహిళలను దూరంగా పంపడంతో సిద్ధరామయ్య కారు ముందుకు కదిలింది.