ఆమె నాకు మసాజ్ చేస్తూ.. వీడియో తీసి రూ.5 కోట్లు డిమాండ్ చేసింది: మాజీ మంత్రి చిన్మయానంద సంచలన లేఖ
- 23 ఏళ్ల లా విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలు
- షాజహాన్‌పూర్ జైలు నుంచి ఎస్పీకి లేఖ
- వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసిందని ఆరోపణ
ఆమె తనకు మసాజ్ చేస్తూ రహస్యంగా వీడియో తీసిందని, ఆపై దానిని చూపించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఈ విషయంలో ఆమెకు సంజయ్, సచిన్, విక్రమ్ అనే స్నేహితులు సహకరించారని పేర్కొన్నారు. వారిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బాధితురాలైన న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద కేసు పెట్టాలని కోరుతూ చిన్మయానంద తరపు న్యాయవాది చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్‌కు పిటిషన్ సమర్పించారు.