ట్రంప్ కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ షాక్!
- కుర్దులపై దాడులు ఆపండంటూ రాసిన ట్రంప్ లేఖ బేఖాతరు
- నన్నే ఆదేశిస్తారా? అంటూ ఆగ్రహం
- కుర్దులుండే ప్రారంతాలపై తాజాగా దాడులకు ఆదేశం
అంతేకాక, టర్కీపై ఆంక్షలు విధించేలా తనను పురికొల్పవద్దని.. ఆ విధంగా చేస్తే.. నేను కూడా టర్కీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన వాడిగా చరిత్రలో నిలిచిపోతానని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై ఎర్డోగాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఒక దేశాధ్యక్షుడు మరో దేశాధ్యక్షుడికి లేఖ రాసే విధానమిదేనా? అంటూ ట్రంప్ తీరుపై నిరసన వెళ్లగక్కాడు. అంతటితో ఆగక దేశంలో కుర్దులు నివాసముండే ప్రాంతాలపై తాజాగా దాడులు చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీచేశారు.