ఇండియా, చైనాలను భరించలేకపోతున్నాం.. అవి అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు: డొనాల్డ్ ట్రంప్
Add ap7am to your home Screen

ఇండియా, చైనాలను భరించలేకపోతున్నాం.. అవి అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు: డొనాల్డ్ ట్రంప్

  • ఇండియా, చైనాలపై మరోసారి మండిపడ్డ ట్రంప్
  • డబ్ల్యూటీవో ఇచ్చిన ట్యాగ్ ను అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి
  • డబ్ల్యూటీవోకు లేఖ రాశాం
'అభివృద్ధి చెందుతున్న దేశాలు' అంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) ఇచ్చిన ట్యాగ్ ను అనుకూలంగా మలుచుకుని ఇండియా, చైనాలు తమపై అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ రెండు దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూటీవోకు తాము లేఖ రాశామని చెప్పారు. వీటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా తాము పరిగణించమని స్పష్టం చేశారు.

అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిపిందే. మరోవైపు, తమ ఉత్పత్తులపై ఇండియా భారీగా సుంకాలను వేస్తోందని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే, రెండు దేశాలపై ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు. ఈ రెండు దేశాలు భరించలేనివిగా తయారయ్యాయని మండిపడ్డారు.
USA
India
China
WTO
Donald Trump
Developing Nations

More Telugu News