జేడీయూతో విభేదాలు లేవు: అమిత్ షా
- వచ్చే ఏడాది బీహార్ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాం
- కూటమి నాయకత్వ బాధ్యతలు నితీశ్ కుమార్ వే
- ఎన్నికల అనంతరం కూడా ఆయనే ముఖ్యమంత్రి
కొంతకాలంగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మిత్రపక్షం బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఈ ఇరు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ సందేహాలకు అమిత్ షా తెరదించారు.