అయోధ్య కేసులో ముగిసిన విచారణ.. తీర్పును రిజర్వ్ లో ఉంచిన సుప్రీంకోర్టు
- అయోధ్య స్థల వివాదం కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు
- ఇంతకు మించి వినడానికి ఏమీ లేదని వ్యాఖ్య
- నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్న రంజన్ గొగోయ్
ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వాదనలను వింటామని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ... ఒక గంట ముందే అంటే 4 గంటలకే విచారణ ముగిసినట్టు ప్రకటించింది. ఇంతకు మించి వినడానికి ఏమీ లేదని తెలిపింది. తీర్పును రిజర్వ్ లో ఉంచింది. నవంబర్ 17న ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగానే తీర్పును వెలువరించే అవకాశాలు ఉన్నాయి.