Andhra Pradesh: సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన రద్దు!
ఏపీ సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు జగన్ కు అపాయింట్ మెంట్ లభించలేదని సమాచారం. దీంతో, జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, జగన్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకకపోవడం వరుసగా ఇది రెండోసారి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీగా ఉన్నందున అపాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం.