యాచకుని వద్ద రూ.10 లక్షలకు పైగా నగదు.. ఆశ్చర్యపోయిన పోలీసులు
- చేతి సంచిలో లక్షా 77 వేల చిల్లర
- బ్యాంకుల్లో రూ.8.77 లక్షల డిపాజిట్లు
- రైలు ప్రమాదంలో మృతి చెందడంతో బయటపడిన వివరాలు
సంచిలో ఉన్న చిల్లరను దాదాపు 8 గంటలపాటు లెక్కించగా లక్షా 77 వేల రూపాయలుగా తేలింది. అతను వేర్వేరు బ్యాంకుల్లో చేసిన డిపాజిట్ మొత్తం 8 లక్షల 77 వేల రూపాయలుగా గుర్తించారు. ఈ యాచకుని వద్ద పాన్ కార్డు, ఆధార్‌కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు కూడా ఉండడం మరో విశేషం. మృతుని స్వస్థలం రాజస్థాన్ రాష్ట్రం కాగా, ఏళ్ల క్రితం ముంబై వచ్చినట్లు గుర్తించారు. అజాద్ కుటుంబ సభ్యుల కోసం సంప్రదిస్తున్నట్లు తెలిపారు.