జగన్ ను చూసి నేర్చుకోవాలి... కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన జేఏసీ చీఫ్ అశ్వత్థామరెడ్డి
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదన్న సీఎం!
- ఘాటుగా స్పందించిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ
- ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్న అశ్వత్థామరెడ్డి
తమ పోరాటంలో ధర్మం, న్యాయం ఉందని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. తాము కూడా న్యాయపరంగానే ముందుకెళతామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. అంతకుముందు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ సమ్మెలో పాల్గొన్న వారిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం.