ఆయనే బతికుంటే 'శభాష్ రా చిరంజీవీ' అనేవారు: చిరంజీవి
- తాడేపల్లి గూడెంలో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ
- విగ్రహాన్ని చూస్తుంటే మనసు ఉప్పొంగుతోంది
- ఫ్యాన్స్ కోసం మరిన్ని చిత్రాలు చేస్తానన్న చిరంజీవి
ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తనను గంటా శ్రీనివాస్, ఈలి నాని తదితరులు గతంలోనే కోరారని, అయితే, అన్ని అనుమతులూ వచ్చేసరికి ఇంత సమయం పట్టిందని అన్నారు. తన ఫ్యాన్స్ చూపే అభిమానమే తనను ఇంతవాడిని చేసిందని వ్యాఖ్యానించిన చిరంజీవి, భవిష్యత్తులో అభిమానులు మెచ్చే మరిన్ని చిత్రాలను చేయడమే లక్ష్యమన్నారు. తొమ్మిది అడుగులా 3 అంగుళాల ఎత్తున్న ఈ విగ్రహాన్ని చూస్తుంటే తన మనసు ఉప్పొంగుతోందని చెప్పారు.