అయోధ్యపై హిందువులకు అతి త్వరలో శుభవార్త: యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు!
- అయోధ్యపై సుప్రీంలో రోజువారీ వాదనలు
- మన ఊపిరిలోనే శ్రీరాముడు
- ఆయనే హిందువులకు ఆదర్శమన్న యోగి
అవేధ్యనాథ్ జీ మహారాజ్ స్మృత్యర్థం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆదిత్యనాథ్, "మన ఊపిరిలోనే శ్రీరాముడు ఉన్నాడు. మనమందరమూ ఆయన భక్తులమే. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. సమీప భవిష్యత్తులోనే హిందువులంతా ఆనందించే సమయం ఉంది" అని అన్నారు.
కాగా, అయోధ్య, రామ జన్మభూమి కేసులో ఈ నెల 17 వరకూ వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రోజువారీ వాదనలు జరుగుతున్నాయి.