'బాబు చంపేస్తాడు' అనే పాటను పరమ వీరబ్రహ్మ ముహూర్తంలో విడుదల చేస్తున్నాం: రామ్ గోపాల్ వర్మ

  • 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వర్మ
  • సాయంత్రం 4.59 గంటలకు పాటను విడుదల చేస్తున్నట్టు ట్వీట్
  • పాట విని ఆనందించకండి.. ఆలోచించండి అంటూ వ్యాఖ్య
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా 'బాబు చంపేస్తాడు' అనే పాటను ఈ సాయంత్రం విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా వర్మ తెలిపారు.

''బాబు చంపేస్తాడు' అనే పాటను ఈరోజు సాయంత్రం 4.37కి వీరబ్రహ్మ ముహూర్తంలో విడుదల చేయబోతున్నామని ఇంతకు ముందు చెప్పాను. కానీ ఇప్పుడు సాయంత్రం పరమ వీరబ్రహ్మ ముహూర్తమైన 4.59 గంటలకు విడుదల చేయబోతున్నాం. దయచేసి విని ఆనందించకండి... ఆలోచించండి' అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Ram Gopal Varma
Kamma Rajyamlo Kadapa Redlu Movie
Tollywood

More Telugu News