నిహారిక నుంచి 'మ్యాడ్ హౌస్' వెబ్ సిరీస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిహారిక నుంచి 'మ్యాడ్ హౌస్' వెబ్ సిరీస్

  • నిహారిక నుంచి మరో వెబ్ సిరీస్ 
  • రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగే కథ 
  • టైటిల్ గా 'మ్యాడ్ హౌస్' ఖరారు
నిహారిక ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరో వైపున వెబ్ సిరీస్ లు చేస్తూ వెళుతోంది. అయితే సినిమాల కంటే వెబ్ సిరీస్ లే ఆమెకి మంచి పేరును తీసుకొచ్చాయి. దాంతో ఆమె పూర్తి దృష్టిని వెబ్ సిరీస్ ల పైనే పెట్టినట్టుగా తెలుస్తోంది.

తాజాగా ఆమె తన సొంత బ్యానర్ అయిన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మాతగా మరో వెబ్ సిరీస్ కి శ్రీకారం చుట్టేసింది. రొమాంటిక్ కామెడీ డ్రామాతో నడిచే ఈ వెబ్ సిరీస్ లో నాయకా నాయికలుగా సంతోష్ - కృతి సింగ్ కనిపించనున్నారు. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్ కి 'మ్యాడ్ హౌస్' అనే టైటిల్ ను ఖరారు చేసేసి, యూట్యూబ్ లో ప్రోమోను కూడా వదిలారు. ఈ వెబ్ సిరీస్ 100 ఎపిసోడ్లుగా ప్రసారం కానున్నట్టుగా తెలుస్తోంది. ఈఇక ఇది ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
Niharika

More Telugu News