ముంబయిని ముంచెత్తనున్న వర్షాలు...రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
- ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని సూచన
- లోతట్టు ప్రాంతాలకు వరద ప్రమాదం
- పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయని తెలిపింది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటించామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆశిష్ షెలార్ చెప్పారు. భారీవర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం వున్న నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు