మీ శకుని మామ పర్యవేక్షణలో కంచేటి సాయి అనే తోలుబొమ్మను అడ్డుపెట్టుకున్నారు... శభాష్!: జగన్ పై నారా లోకేశ్ ఫైర్

  • కోడెల మృతిపై నారా లోకేశ్ స్పందన
  • సీఎం జగన్ పై విమర్శలు
  • నీచ శవరాజకీయాలంటూ వ్యాఖ్యలు
టీడీపీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. మీ శకుని మామ విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో కంచేటి సాయి అనే తోలుబొమ్మను అడ్డుపెట్టుకుని నాటకాలకు తెరదీశారని ఆరోపించారు.

"విదేశాల్లో ఉన్న కోడెల కుమారుడి కారణంగానే ఈ దారుణం జరిగిందని కంచేటి సాయితో కేసు పెట్టించారు, నీచ శవరాజకీయాలలో మీకు మీరే సాటని మరోసారి నిరూపించుకున్నారు వైఎస్ జగన్ గారూ!" అంటూ ట్వీట్ చేశారు. బంధుప్రీతి లేని వ్యక్తి కోడెల అని, బంధువైనా సరే నేరస్తుడని తెలిస్తే ఆయన దూరం పెడతారని వివరించారు. ఆయన అలా నిరాకరించడంతో అతడిని మీ సహకారంతో పెదకూరపాడులో స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Kodela
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News