ధర్మశాల టి20 మ్యాచ్ కు వాన గండం!

  • భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టి20
  • ధర్మశాల వేదికగా మ్యాచ్
  • ధర్మశాలలో మధ్యాహ్నం భారీ వర్షం
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ధర్మశాలలో నేడు తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, వాతావరణ శాఖ నివేదిక మాత్రం నిరాశకు గురిచేస్తోంది. మ్యాచ్ కు వాన ముప్పు ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ప్రస్తుతం కూడా ధర్మశాలలో వర్షం పడుతుండడంతో మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో మైదానం చిత్తడిగా మారింది.
Go Back to Shorts
Dharmashala
T20
India
South Africa

More Telugu News