నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నాగబాబు స్పందన
Add ap7am to your home Screen

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నాగబాబు స్పందన

  • అడవుల్ని ధ్వంసం చేయడం కరెక్ట్ కాదన్న మెగాబ్రదర్
  • ప్రకృతిని కాపాడుకోవాలంటూ పిలుపు
  • నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్
సువిశాలమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ స్పందించారు. తాజాగా, మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

అడవుల్ని ధ్వంసం చేసి మైనింగ్ చేయడం అనేది సరికాదని హితవు పలికారు. ప్రకృతిని కాపాడుకోవాలని, నల్లమలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, change.org వెబ్ సైట్లో ఆన్ లైన్ పిటిషన్ కు సైనప్ చేయాలని కూడా పర్యావరణ ప్రేమికులకు సూచించారు.
Nagababu
Nallamala
Urenium
Mining

More Telugu News