కేశినేని నాని ట్వీట్ లో అచ్చుతప్పులు.. భాషా పరిజ్ఞానంతో చచ్చిపోతున్నామని పీవీపీ వెటకారం!
- జగన్ సర్కారుపై కేశినేని విమర్శలు
- కేశినేని కామెంట్లను తిప్పికొట్టిన పీవీపీ
- ఇంటర్ లేదా డిగ్రీలో చేరాలని సెటైర్లు
వివక్షాపూరితంగా వ్యవహరించడం అనే పదాన్ని ఇంగ్లీష్ లో BIASED అంటారనీ, BAISED అని కాదని చురకలు అంటించారు. రోడ్డుపైకి ఎక్కి ఓ ఐపీఎస్ అధికారిపై రౌడీయిజం చేసినప్పుడు కేశినేనికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వంటివి గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. ఏదో భగత్ సింగ్ లాగా బిల్డప్ ఇవ్వవద్దని కేశినేనికి హితవు పలికారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా అమ్మఒడి పథకం కింద తాను రీయింబర్స్ మెంట్ చేయిస్తాననీ, ఇంటర్ లేదా డిగ్రీ పూర్తిచేయాలని పీవీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.