ప్రియమైన సమంత... అనుకున్న దానికంటే నువ్వు ఎక్కువే సాధించాలని ఆశీర్వదిస్తున్నా: సద్గురు ట్వీట్
- మొక్కలు నాటే ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సద్గురు
- కావేరీ పిలుస్తోంది పేరిట విస్తృత ప్రచారం
- ఉద్యమంలో పాలుపంచుకుంటున్న సమంత
- లక్ష మొక్కలు నాటడమే లక్ష్యం
"ప్రియమైన సమంత, 'కావేరీ పిలుస్తోంది కోసం' నువ్విచ్చిన పిలుపుతో ఎంతోమంది యువతీయువకులు ముందుకు వస్తున్నట్టు తెలిసింది. ఈ క్రతువులో నువ్వు లక్ష్యాన్ని మించి సాధించాలని కోరుకుంటున్నాను. ఆ దిశగా నువ్వు సఫలం కావాలని ఆశీర్వదిస్తున్నా. భవిష్యత్ తరాలకు మనం అందించే అత్యుత్తమ బహుమతి ఇదే" అంటూ ట్వీట్ చేశారు. సద్గురు మొత్తం 242 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించడం తెలిసిందే.