రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు!: టీడీపీ అధినేత చంద్రబాబు
- రివర్స్ ఎన్నికలు మాత్రం రావు ‘జమిలి’ రావొచ్చు
- రాజధాని అమరావతిని పురిట్లోనే చంపేశారు
- అవినీతిలో చిక్కుకుపోయిన వ్యక్తా నాపై ఆరోపణలు చేసేది?
ఇప్పుడు మళ్లీ అంతకు మించిన అరాచకాలు జరుగుతున్నాయని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ హయాంలో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతికి శ్రీకారం చుడితే దాన్ని పురిట్లోనే చంపేశారని వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అవినీతిలో చిక్కుకుపోయి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లిన వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ పరోక్షంగా సీఎం జగన్ పై ఆరోపణలు గుప్పించారు.