‘అమ్మఒడి’ పథకంపై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని!
- అమ్మఒడి చాలా గొప్ప పథకం
- ప్రతీ తల్లికి రూ.15 వేలు అందుతాయి
- ఇంగ్లిష్ విద్యాబోధన పెరగాల్సిన అవసరముంది
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలే దేవాలయాలనీ, ఆ స్కూళ్లే ఎంతో మంది మేధావులను దేశానికి అందించాయని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ విద్యాబోధన పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ‘నేను ఎవరిని పొగడటం లేదమ్మా.. ప్రెస్ వాళ్లు తప్పుగా రాయొద్దు. నేను ఎవరినీ పొగడటం లేదు’ అని కేశినేని నాని స్పష్టం చేశారు.