ఏపీలో కక్షపూరిత రాజకీయాలు.. అందుకే నాపై తప్పుడు కేసు పెట్టారు!: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- జగన్ పై సొంత పార్టీలోనే వ్యతిరేకత
- ఏపీని నాశనం చేస్తున్నారు
- ఇసుక ట్రాక్టర్ రూ.2,500కు చేరుకుంది
ఇందులో భాగంగానే తనపై తప్పుడు కేసు బనాయించారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ తీరుపై సొంత వైసీపీలోనే వ్యతిరేకత వస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళుతూ, అప్పగిస్తే ఇప్పుడు నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలను అసలు ఎందుకు ఆపేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ట్రాక్టర్ ఇసుకను జగన్ సర్కారు రూ.2,500 చేసేసిందని ఆరోపించారు.