వాలంటీర్లకు ఏం తక్కువ.. అజ్ఞాని, అప్రయోజకుడైన మాలోకానికే పెళ్లయిందిగా!: విజయసాయిరెడ్డి సెటైర్లు
- వాలంటీర్లకు పిల్లనివ్వరని బాబు అంటున్నారు
- లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించారు
- అలాంటి వాలంటీర్లకు ఏం తక్కువ?
‘అప్రయోజకుడు, అజ్ఞాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్లకు ఏం తక్కువని చంద్రబాబు అపశకునాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేశారు.