'వాల్మీకి' నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ సిద్ధం
- హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
- తమిళ 'జిగర్తాండ'కి రీమేక్
- ఈ నెల 20వ తేదీన విడుదల
ఈ సినిమా నుంచి ఇటీవలే 'జర్రా జర్రా' అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'గగన వీధిలో' అనే మరో లిరికల్ వీడియో సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాటను అధర్వ మురళి - మృణాళిని రవిపై చిత్రీకరించినట్టుగా పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. మిక్కీ జె.మేయర్ సమకూర్చిన ఈ మెలోడీకి వనమాలి సాహిత్యాన్ని అందించారు. తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ'కి రీమేక్ గా వస్తోన్న ఈ సినిమా, ఆ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.