మెగాస్టార్ సరసన నాయికగా ఇలియానా?
- 'సైరా' కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్
- చిరూతో సినిమా కోసం కొరటాల సన్నాహాలు
- గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఐశ్వర్య రాయ్
ఈ సినిమాలో చిరంజీవి బరువు తగ్గి, డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపించనుండటం అనే అంశం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమాలో ఆయన హాకీ కోచ్ గా కనిపించనున్నారనే మరో వార్త మరింత కుతూహలాన్ని పెంచుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా ఐశ్వర్య రాయ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కొరటాల చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. దాంతో ఆయన ఇలియానాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం ద్వారా ఆ మధ్య ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.