యాంకర్ శ్రీముఖిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

  • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన శుశ్రుత్
  • చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు
  • తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆంగ్ల పత్రికపైనా ఫిర్యాదు
ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ పోటీదారు శ్రీముఖిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ ఆమె సోదరుడు శుశ్రుత్ గురువారం హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆమెను బయటకు పంపేందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

మరోవైపు, తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పత్రికలో గత రెండు రోజులుగా తనపై అసత్య కథనాలు వస్తున్నాయని, శ్రీముఖి ప్రవర్తన తప్పుగా ఉందని రాస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఇటీవల కాలంలో ఇవి మరింత ఎక్కువ కావడంతోనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Go Back to Shorts
sreemukhi
bigboss
anchor
tv show

More Telugu News