Crime News: గణపతి చందా పేరుతో రాక... అదను చూసి చైన్‌స్నాచింగ్‌కు యత్నం

షార్ట్స్‌లో చూడండి
వినాయక చవితి వస్తుండడంతో చందా వసూళ్ల ముసుగులో ఇద్దరు నిందితులు చైన్‌స్నాచింగ్‌ కు పాల్పడడం నిజామాబాద్‌ పట్టణంలో కలకలం రేపింది. పట్టపగలు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్లో ఒకరు చేతికి చిక్కడంతో పోలీసులకు అప్పగించారు.

పోలీసుల కథనం మేరకు...నిజామాబాద్‌ పట్టణం సాయికృపనగర్‌ కాలనీ మొదటి అంతస్తులో ఓ కుటుంబం నివసిస్తోంది. ఇద్దరు వ్యక్తులు చందా పుస్తకం పట్టుకుని వీరింటికి వచ్చారు. చందా అడగగా లేదనడంతో మంచి నీరు కావాలని కోరారు. సదరు మహిళ నీరు ఇచ్చేందుకు వెనుతిరిగేలోగానే ఆమె మెడలోని చైన్‌ తెంపుకొని పరారయ్యేందుకు ప్రయత్నించారు.

 దీంతో ఆమె గట్టిగా అరవడంతో అప్పటికి ఇంట్లోనే ఉన్న ఆమె భర్త వెంటనే వచ్చి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరిలో ఒకడు పారిపోగా మరొక వ్యక్తిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారు రాగానే అప్పగించారు. ఈ సంఘటనలో బాధిత మహిళ భర్తకు గాయాలయ్యాయి. నిందితులు మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు.
Go Back to Shorts
Crime News
chain snaching
nizamabad

More Telugu News