అక్టోబర్ మొదటి వారంలో 'ఆర్టికల్ 370' పిటిషన్లపై సుప్రీం విచారణ.. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు!
- ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు
- అధికరణ రద్దును సవాల్ చేస్తూ 15 పిటిషన్లు దాఖలు
- అన్ని పిటిషన్లను విచారించనున్న ధర్మాసనం
370 అధికరణ రద్దుతోపాటు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ మొత్తం 15 పిటిషన్లు దాఖలు కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.