చిరంజీవిగారితో మామయ్యను పోల్చలేం: బాలకృష్ణ చిన్నల్లుడు భరత్
Add ap7am to your home Screen

చిరంజీవిగారితో మామయ్యను పోల్చలేం: బాలకృష్ణ చిన్నల్లుడు భరత్

  • చిత్ర పరిశ్రమలో తాను ఎవరికీ రేటింగ్ ఇవ్వలేనన్న బాలయ్య చిన్నల్లుడు
  • చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారన్న భరత్
  • ఎన్టీఆర్ గారి అబ్బాయిగా బాలయ్య ఎంట్రీ ఇచ్చాడంటూ వ్యాఖ్యలు
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ టీడీపీలో కీలకనేతగా కొనసాగుతున్న భరత్ సినీ రంగంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో తాను ఎవరికీ పెద్దగా రేటింగ్ ఇవ్వలేనని, ఒక్కో హీరోకి సంబంధించి కొన్ని చిత్రాలు బాగా నచ్చుతాయని తెలిపారు.

ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా ఉన్న చిరంజీవికి, తన మామయ్య బాలకృష్ణకు ఎంతో తేడా ఉందని అన్నారు. చిరంజీవి సొంత కష్టం మీద ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని, కానీ తన మామయ్య ఎన్టీఆర్ గారి అబ్బాయిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చారని భరత్ వివరించారు. ఈ కారణంగానే ఇద్దరినీ పోల్చలేమని స్పష్టం చేశారు. బాలకృష్ణ గారు 2000 సంవత్సరానికి ముందు, ఆ తర్వాత ఒకే మూసలో వెళ్లారని, ఫ్యాక్షన్ చిత్రాలకే మొగ్గుచూపారని, కానీ చిరంజీవి గారు అన్ని రకాల చిత్రాలు చేసుకుంటూ వెళ్లారని విశ్లేషించారు.

వాస్తవానికి చిరంజీవి గారిలో ఉన్న ప్రతిభను చిత్ర పరిశ్రమ అన్ని విధాలుగా ఉపయోగించుకుందని, అదే సమయంలో బాలకృష్ణ గారిని మాత్రం సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయిందన్నది తన అభిప్రాయమని భరత్ చెప్పారు. కొత్త పాత్రలు, వెరైటీ స్క్రిప్టులు తీసుకువస్తే బాలయ్యకు నచ్చదని భావించిన సినీ రైటర్లు, దర్శకులు ఓ ఇమేజ్ చట్రంలో తన మామయ్యను ఊహించుకుని అలాగే కంటిన్యూ అయ్యారని అభిప్రాయపడ్డారు. కానీ, వినూత్న ఆలోచనలు, సరికొత్త పాయింట్లతో కూడిన స్క్రిప్టులతో వస్తే బాలకృష్ణ గారిని మరింత కొత్తగా చూడగలం అని భరత్ తెలిపారు.
Bharath
Balakrishna
Chiranjeevi
Tollywood

More Telugu News