జలాలాబాద్ లోని పాక్ ఎంబసీపై ఉగ్రదాడి!
- గత రాత్రి భారీ పేలుడు
- ముగ్గురికి గాయాలు
- భద్రతను పటిష్ఠం చేయాలని కోరిన పాక్
అయితే, తమ దేశ రాయబార కార్యాలయ అధికారులంతా క్షేమమేనని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో వీసాల నిమిత్తం దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన ఇద్దరు పాక్ పౌరులకు గాయాలు అయ్యాయని తెలిపారు. రాయబార కార్యాలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని తాము ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కోరామని ఫైజల్ తెలిపారు.