ఏపీలో ‘ఈ-కేవైసీ’ ఎప్పుడైనా చేయించుకోవచ్చు.. ప్రజలు టెన్షన్ పడొద్దు!: ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
- రేషన్ సరుకులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం
- మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం
- కడపలో మీడియాతో వైసీపీ నేత
ఈ-కేవైసీ సాకుతో రేషన్ డీలర్లు ప్రజల పేర్లను తొలగించినా, రేషన్ సరుకులు ఇవ్వకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ-కేవైసీ ప్రక్రియను సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ-కేవైసీ కోసం మహిళలు చంటి బిడ్డలతో గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.