టెండూల్కర్ సాధించిన ఈ రికార్డును మాత్రం కోహ్లీ బద్దలు కొట్టలేడు: సెహ్వాగ్
- కోహ్లీ ఒక గొప్ప బ్యాట్స్ మెన్
- సచిన్ పేరిట ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొడతాడు
- అత్యధిక టెస్టులు ఆడిన రికార్డును మాత్రం అధిగమించలేడు
కోహ్లీ పరుగులు సాధిస్తున్న తీరు, సెంచరీలను కొడుతున్న తీరు అతనొక గొప్ప బ్యాట్స్ మెన్ అని నిరూపిస్తున్నాయని సెహ్వాగ్ అన్నాడు. తన గొప్ప నైపుణ్యంతో సచిన్ కు చెందిన ఎన్నో రికార్డులను కూడా కోహ్లీ అధిగమిస్తాడని తెలిపాడు. కానీ, అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీనే కాదు, మరే ఇతర ఆటగాడు కూడా బద్దలు కొట్టలేడని చెప్పాడు.