బాలీవుడ్ లో నటించడానికి నాకేం ఇబ్బంది?: రామ్ చరణ్
- సైరా హిందీ టీజర్ ముంబయిలో విడుదల
- కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, రామ్ చరణ్, తమన్నా
- మంచి కథ లభిస్తే బాలీవుడ్ లో కూడా చేస్తానన్న చెర్రీ
బాలీవుడ్ లో నటించడానికి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? అని ప్రశ్నించగా, బాలీవుడ్ లో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బందిలేదని, అయితే సరైన కథ దొరక్కపోవడం వల్లే తాను బాలీవుడ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని వివరించారు. సరైన ప్రాజక్ట్ అనుకుంటే బాలీవుడ్ లో నటించడానికి ఎప్పుడూ సిద్ధమేనని రామ్ చరణ్ స్పష్టం చేశారు. అయితే, తెలుగు చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల బాలీవుడ్ గురించి ఆలోచించలేకపోతున్నానని తెలిపారు.