ఎల్లో మీడియాకు ఇక పెద్ద చిక్కే: విజయసాయి రెడ్డి
Add ap7am to your home Screen

ఎల్లో మీడియాకు ఇక పెద్ద చిక్కే: విజయసాయి రెడ్డి

  • రివర్స్ గేర్ వేయక తప్పడం లేదు
  • మోదీని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేశారు
  • ఇప్పుడు వారే బీజేపీలోకి వెళుతున్నారన్న విజయసాయి
చంద్రబాబుకు కొమ్ము కాస్తూ వచ్చిన ఎల్లో మీడియా ఇప్పుడు రివర్స్ గేర్ వేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెడుతూ, "చంద్రబాబు గారు బీజేపీని వదిలి పెట్టాక కుల మీడియా ఆ పార్టీని ఒక విలన్ గా చిత్రీకరించింది. మొన్నటి దాకా మోదీ గారిని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసింది. ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలోకి దూకుతున్నారు. ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చి పడింది. రివర్స్ గేర్ వేయక తప్పడం లేదు" అని అన్నారు. 
Vijay Sai Reddy
Twitter
Chandrababu
BJP

More Telugu News