ఇండియా ఇక అభివృద్ధి చెందుతున్న దేశం కాదు... ఆ ముసుగులో మోసం చేయలేరు: ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- ఇండియా, చైనాలు వర్ధమాన దేశాలు కాదు
- ఎన్నో ఏళ్లుగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించాం
- ఇకపై ఉపేక్షించబోమన్న డొనాల్డ్ ట్రంప్
ఇండియా, చైనాలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఎన్నో ఏళ్లుగా అమెరికా ఆర్థిక ప్రయోజనాలను దగ్గర చేస్తూ వచ్చిందని, కానీ, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ట్యాగ్ తో అవి అమెరికాను నష్టపరుస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్క అమెరికా తప్ప అన్ని దేశాలూ ఎదుగుతున్నాయని, వర్ధమాన దేశాల హోదాను వాడుకుంటూ, అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్న దేశాలను అడ్డుకుని తీరుతామని అన్నారు.