పాత్రికేయుడు తాతాజీగారి ఆకస్మిక మరణం చాలా బాధాకరమైన విషయం!: టీడీపీ అధినేత చంద్రబాబు

  • తాతాజీ నిబద్ధత, నైతిక విలువలతో జీవించారు
  • ప్రజాసమస్యలపై నిర్భీతిగా స్పందించేవారు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధ్యక్షుడు
ప్రముఖ జర్నలిస్ట్ తాతాజీ మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాతాజీ నిబద్ధత, నైతిక విలువలు కలిగి ప్రజాసమస్యల పట్ల నిర్భీతిగా స్పందించేవారని తెలిపారు. ఆయన మరణం చాలా బాధాకరమైన విషయమని వ్యాఖ్యానించారు. ఆదర్శప్రాయుడైన తాతాజీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే తాతాజీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Chandrababu
journalist
tataji
death
Twitter

More Telugu News