ఉప రాష్ట్రపతి అర్హతలు ఎలా ఉండాలో మోదీ, షాలకు నేనే చెప్పాను... వారు నన్నే ఎంపిక చేశారు: వెంకయ్యనాయుడు
- ఉప రాష్ట్రపతిగా తన అనుభవాలతో పుస్తకం రాసిన వెంకయ్యనాయుడు
- చెన్నైలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
- లిజనింగ్... లెర్నింగ్... లీడింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్ షా
ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలేంటో మోదీ, అమిత్ షాలకు వివరించానని, ఉప రాష్ట్రపతి పదవి దక్షిణాది వ్యక్తికి ఇద్దామని చెప్పానని, రైతు కుటుంబం నుంచి వచ్చిన నిరాడంబరమైన వ్యక్తి అయితే బాగుంటుందని సూచించానని తెలిపారు. అయితే, ఊహించని విధంగా మోదీ, అమిత్ షా తననే ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేశారని వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. పార్టీలో కూడా తన అభ్యర్థిత్వం పట్ల ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదని వివరించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు పార్టీ అనేక పదవులు కట్టబెట్టి ప్రోత్సాహం అందించిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.