విజయవాడ, తిరుపతి ఘటనలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి!: పవన్ కల్యాణ్ డిమాండ్
- ఎన్ఎంసీకి వ్యతిరేకంగా జూడాల ఆందోళన
- విజయవాడ, తిరుపతిలో పోలీసులతో వాగ్వాదం
- విజయవాడలో పోలీసుల దాడిపై స్పందించిన జనసేనాని
విజయవాడ, తిరుపతిలో చోటుచేసుకున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అలాగే యువ వైద్యుల్లో మనోధైర్యం, మానసిక స్థైర్యం నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేనాని అభిప్రాయపడ్డారు.