మోదీని వదిలి వెళ్లిన వారందరికీ పతనం తప్పలేదు: మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్
- మోదీని వదిలి వెళ్లిన వారిని ప్రజలు క్షమించరు
- సీట్ల పంపకాల విషయంలో శివసేనతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి
- ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
ఇప్పటికే మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలు కలసికట్టుగా కాకుండా... వేర్వేరుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. 'జన ఆశీర్వాద యాత్ర' పేరుతో శివసేన భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ, సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. కలసి పోటీ చేస్తే కొన్ని చోట్ల గెలుపు, మరికొన్ని చోట్ల ఓటమిపాలయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు.