కోహ్లీ ఏంచేసినా రోహిత్ తో ముడిపెడుతున్న నెటిజన్లు!
- వరల్డ్ కప్ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలంటూ కథనాలు
- కోహ్లీ, అనుష్కలను అన్ ఫాలో చేసిన రోహిత్
- తాజాగా కోహ్లీ పెట్టిన ఫొటోలో రోహిత్ మిస్
కోహ్లీ పెట్టిన ఆ ఫొటోలో రోహిత్ శర్మ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ... రోహిత్ ఎక్కడ అంటూ నిలదీస్తున్నారు. వరల్డ్ కప్ ముగసిన తర్వాత కోహ్లీని రోహిత్ శర్మ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టు అనుమానాలు బయల్దేరాయి. ఆ తర్వాత అనుష్క శర్మను కూడా రోహిత్ అన్ ఫాలో చేయడంతో మొత్తానికి ఏదో జరిగిందన్న సంకేతాలు వెలువడ్డాయి. మరి, ఇది ఎంతవరకు వెళుతుందన్నది కాలమే చెప్పాలి!