కెనడా గ్లోబల్ టి20 లీగ్ లో యువరాజ్ మెరుపులు

  • ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన యువీ
  • కెనడా లీగ్ లో టొరంటో నేషనల్స్ టీమ్ కు ప్రాతినిధ్యం
  • ఎడ్మంటన్ రాయల్స్ పై దూకుడు
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్ కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టీ20 లీగ్ లో అదరగొడుతున్నాడు. ఈ లీగ్ లో టొరంటో నేషనల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ ఎడ్మంటన్ రాయల్స్ తో మ్యాచ్ లో 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ స్కోరులో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో పాత యువీని గుర్తుచేశాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఎడ్మంటన్ రాయల్స్ 6 వికెట్లకు 191 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో టొరంటో నేషనల్స్ 17.5 ఓవర్లలోనే పని పూర్తిచేసింది. యువీ వేగంగా ఆడడంతో టొరంటో జట్టు 13 బంతులు మిగిలుండగానే జయభేరి మోగించింది.
Go Back to Shorts
Yuvraj Singh
Canada
GT20

More Telugu News