చంద్రబాబు రాష్ట్రానికి మంచి చేయలేదు.. మేం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు!: విజయసాయిరెడ్డి
- అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లులు పెట్టాం
- అప్పుడే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు
- జగన్ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు
చంద్రబాబు తన హయాంలో ఏపీకి ఒక్క మంచి పని కూడా చేయలేదనీ, ఇప్పుడు సీఎం జగన్ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. టీడీపీ హయాంలో దాణా కుంభకోణం కంటే భారీగా అవినీతి జరిగిందని ఇటీవల విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.