విశాఖ పోలీసులకు ‘టిక్ టాక్’ పిచ్చి.. డ్యూటీలో ఉంటూనే కుప్పిగంతులు, ఎంజాయ్!
- టిక్ టాక్ వీడియోలు చేస్తున్న పోలీసులు
- అధికారుల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు
- స్పందించని ఉన్నతాధికారులు, ప్రభుత్వం
శక్తి టీమ్ కారులోనే తమలోని కళా నైపుణ్యాలను బయటపెడుతూ వీడియోలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు. విధినిర్వహణ సమయంలో పోలీసులు ఇలా టిక్ టాక్ వీడియోలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఇటు జిల్లా పోలీసులు, అటు ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.